(MS8NEWS జనవరి 2): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ డివిజన్ల జాబితాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాన అభ్యంతరాలు:
గతంలో జరిగిన డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని, కేవలం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే ఎలక్టోరల్ బ్లాక్‌ల ఆధారంగా విభజన చేశారని ఆరోపించారు.మరణించిన వారు, వలస వెళ్ళిన వారి పేర్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయి.ఒకే ఓటరు పేరు రెండు సార్లు నమోదు కావడం.మహిళా ఓటర్ల పేర్లు పురుషులుగా నమోదు కావడం.ఫోటోలకు, పేర్లకు పొంతన లేకపోవడం వంటి అనేక సాంకేతిక లోపాలు బయటపడ్డాయి.
మున్సిపల్ ప్రధాన అధికారి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని దినేష్ విమర్శించారు.
ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపి, అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలి.ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సవరించిన తర్వాతే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి.అధికార పార్టీకి వంత పాడుతున్న మున్సిపల్ ప్రధాన అధికారిని తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొని 6వ మరియు 43వ డివిజన్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అక్రమాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మద్దెల దినేష్ స్పష్టం చేశారు.

