Monday, April 13, 2026

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

(MS8NEWS జనవరి 13):రామగుండం: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ (MCK) ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు.స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు కమిషనర్ జె. అరుణ శ్రీ ఈ జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా పారదర్శకత కోసం ముసాయిదా కేంద్రాలను వెల్లడించినట్లు తెలిపారు.ఓటర్లకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాల ఎంపిక జరిగింది.కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నగరవాసులు మరియు రాజకీయ ప్రతినిధులు ఈ ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే నిబంధనల ప్రకారం తెలియజేయాలని అధికారులు సూచించారు.

Related Articles

Most Popular