Thursday, February 12, 2026

​రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ‘అరైవ్ – అలైవ్’ అవగాహన సదస్సు లో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనీ తెలిపిన గోదావరిఖని ఎస్‌ఐ అనూష

MS8NEWS గోదావరిఖని, జనవరి 19:రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ చేపట్టిన ‘అరైవ్ – అలైవ్ క్యాంపెనింగ్-2026’ కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని పట్టణ ఎస్‌ఐ అనూష సోమవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద వాహనదారులను ఆపి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.​ఈ సందర్భంగా ఎస్‌ఐ అనూష మాట్లాడుతూ.. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అజాగ్రత్తే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా వాహనదారులు పాటించాల్సిన సూచనలను ఆమె వివరించారు:

​ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలి. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ఎల్లప్పుడూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

​”ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకోవడం లేదా బ్రేకులు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.” ఎస్‌ఐ అనూష తెలిపారు.

​ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆమె కోరారు.

Related Articles

Most Popular