(MS8NEWS డిసెంబర్ 20):రామగుండం పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి గ్రామం సమీపంలోని BPL పైపులైన్ మార్గంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా పులి అడుగు జాడలను (futmarks) గుర్తించడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొమురమ్మ అనే మహిళ గురువారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో BPL ప్రాంతంలో మేకలు మేపడానికి వెళ్ళింది. ఆ సమయంలో పులిని నేరుగా చూసిన ఆమె, భయంతో పరుగులు తీస్తూ గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం అందించింది. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ మరియు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ పులి అడుగులను గుర్తించిన అధికారులు, అది నిజంగానే పులి సంచారమని నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం గ్రామంలో డప్పు చాటింపు వేయించి ప్రజలను హెచ్చరించింది.మల్యాలపల్లి,బద్రిపల్లి,కుందనపల్లి.రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దు అనీఅధికారులు సూచించారు.అవసరమైతే తప్ప అటవీ ప్రాంతం లేదా శివారు ప్రాంతాలకు వెళ్లకూడదు.పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలి.పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.
సకాలంలో స్పందించి ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ మరియు పోలీసు శాఖ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

