( MS8NEWS జనవరి 12 ):తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారి చేసిన షెడ్యూల్ ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ (RMC) తుది ఓటరు జాబితాను సోమవారం అధికారికంగా ప్రచురించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో ఈ జాబితాను విడుదల చేశారు.
నగర పాలక సంస్థ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో కలిపి 1,83,049 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో:
పురుషులు: 91,441
మహిళలు: 91,578
ఇతరులు: 30
పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 137 మంది ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్.ఓ. ఆంజనేయులు, ఆర్.ఐ.లు శంకర్ రావు, ఖాజా, టీపీబీఓలు హిమజ, సింధూజ తదితరులు పాల్గొని ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ తుది జాబితా ప్రచురణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

