MS8NEWS రామగుండం, జనవరి 18: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త డాక్టర్ రవికుమార్ నాగండ్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.డాక్టర్ రవికుమార్ నాగండ్ల విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజ్ ఛైర్మన్/డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. కేవలం విద్యా రంగమే కాకుండా, సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ప్రజలతో మమేకమై ఉన్నారు.
ప్రధాన లక్ష్యాలు:ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. తన విజయం సాధిస్తే డివిజన్ అభివృద్ధిలో ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు,పారదర్శకత మరియు నిజాయితీ అవినీతి రహిత పాలనను అందించడం. 49వ డివిజన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం.ఉపాధి మరియు విద్య యువతకు ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్యా వసతుల కల్పన.
ప్రజల ఆశీర్వాదంతో సేవా మార్గంలో ముందుకు సాగుతానని, డివిజన్ ప్రజలు తనను ఆదరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

