(MS8NEWS జనవరి 6):జనగామ (రామగుండం):రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించాలని, కార్పొరేషన్ కైవసమే లక్ష్యంగా కార్యకర్తలు పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ పిలుపునిచ్చారు.మంగళవారం జనగామ మండల బీజేపీ అధ్యక్షులు గుండబోయిన భూమయ్య అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గెలుపే లక్ష్యం: అత్యధిక సంఖ్యలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని రాజేందర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మచ్చ విశ్వాస్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్‌తో పాటు కింది నాయకులు పాల్గొన్నారు,ఇరుగురాల శివ కుమార్ (జనరల్ సెక్రటరీ)బండారి శ్యామ్, జనగామ శివరాం, మామిడి సంపత్,నర్సయ్య, అంకార్ భారత్, పిట్టలా కొమురయ్య,కుమ్మరి మల్లేష్, విశనాథ్, పృథ్వి, పంగ రవి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

