Monday, April 13, 2026

​రామగుండంలో కొత్త హంగులతో ‘అంబేద్కర్ పార్క్’.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్

MS8NEWS గోదావరిఖని, జనవరి 17 :రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సింగరేణి యాజమాన్యం మరో ముందడుగు వేసింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన, మెడికల్ కాలేజీకి వెళ్లే దారిలో ఉన్న సుమారు 4.50 ఎకరాల సింగరేణి ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్క్ పనులకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.

వైభవంగా భూమి పూజ

​ఆర్జీ-1 జియం శ్రీ లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను మరియు చదును చేసే పనులను ప్రారంభించారు. ఈ పార్క్ నిర్మాణానికి సుమారు రూ. 86 లక్షలు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే వారితో పాటు స్థానిక ప్రజలకు ఈ పార్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.సింగరేణి స్థలాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవడం సంతోషకరమని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్‌ను సింగపూర్, యూరప్ నగరాల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం, కార్మికుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోని నగరాలన్నింటినీ అనుసంధానిస్తూ మెరుగైన రోడ్ మ్యాప్‌తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్.ఓ.టు జియం ఎల్. రమేష్, ఏఐటీయూసీ నాయకురాలు శ్రీమతి పద్మ, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, బొంతల రాజేష్, ఏజీయం (వర్క్‌షాప్) జితేందర్ సింగ్, డీజీయం (సివిల్) వర ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సింగరేణి శ్రీను (పొలసాని శ్రీనివాస్), కమ్యూనికేషన్ సెల్ అధికారి హనుమంతరావు, ముస్తఫా, అధికారులు కుమారస్వామి, సాంబశివరావు, వీరారెడ్డి మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Most Popular