(MS8NEWS జనవరి 10):రామగుండం:నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన అనంతరం కన్నూరి సతీష్ పలువురు కీలక నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ని కలిసి పార్టీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని సతీష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం అవుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

