(MS8NEWS డిసెంబర్ 24): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ‘ఆంధ్రా ట్యాక్సీ’ (Andhra Taxi) పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా ఓలా, ఉబెర్ వంటి ప్రైవేట్ సంస్థలకు దీటుగా, తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. యాప్ ద్వారానే కాకుండా, వాట్సప్ (WhatsApp), ఫోన్ కాల్ లేదా వాహనాలపై ఉండే QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా ఆటో లేదా ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు.ప్రైవేట్ యాప్‌లలో ఉండే ‘సర్జ్ ప్రైసింగ్’ (రద్దీ సమయంలో ధరలు పెరగడం) వంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన రీజనబుల్ ధరలకే ప్రయాణం సాగుతుంది.
మహిళా భద్రతకు పెద్దపీట: ఈ యాప్‌ను స్థానిక పోలీస్ స్టేషన్లతో అనుసంధానించారు. ప్రయాణ వివరాలు, వాహనం డేటా అంతా పోలీస్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉండటం వల్ల మహిళలకు పూర్తి రక్షణ ఉంటుంది.డ్రైవర్ వెరిఫికేషన్: రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షించిన వాహనాలకు, అలాగే వెరిఫై చేసిన డ్రైవర్లకు మాత్రమే ఈ యాప్‌లో అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం అభివృద్ధి: పర్యాటకులు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆటో/ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసి దోపిడీ చేయకుండా ఈ యాప్ అడ్డుకట్ట వేస్తుంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తొలుత ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ) యంత్రాంగం పైలట్ ప్రాజెక్టుగా చేపడుతోంది. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.
గమనిక: ఈ యాప్ త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. అధికారులు దీనికి సంబంధించి తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు.

