Monday, April 13, 2026

మున్సిపల్ ఎన్నికలు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

 

MS8NEWS జనవరి 30 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. నేడు (శుక్రవారం) నామినేషన్ల సమర్పణకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉంది.

రెండో రోజే జోరు.. వేలల్లో నామినేషన్లు

గురువారం నామినేషన్ల ప్రక్రియ రెండో రోజున ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,403 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో:మొత్తం అభ్యర్థులు: 7,080 మంది తమ పత్రాలను సమర్పించారు.

తొలిరోజు గణాంకాలు: మొదటి రోజు కేవలం 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు మాత్రమే వేశారు.నిబంధనలు: సాయంత్రం 5 గంటల లోపు రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకున్న వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు.

నేడు ‘చివరి’ సమరం

నేటితో గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీ ఎత్తున తరలివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల సందడి దృష్ట్యా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Related Articles

Most Popular