MS8NEWS జనవరి 16: ముఖ్యమంత్రితో బుజ్జాయి సందడి: చిప్స్ కావాలంటూ యోగిని కోరిన చిన్నారి!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా పిల్లలతో సరదాగా గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక చిన్నారితో సీఎం జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వార్త వివరాల్లోకి వెళ్తే..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక పిల్లాడిని దగ్గరకు తీసుకుని, ఎంతో వాత్సల్యంతో “నీకు ఇంకేం కావాలి చెప్పు?” అని అడిగారు. దానికి ఆ చిన్నారి ఏమాత్రం తడబడకుండా సీఎం చెవిలో “చిప్స్ కావాలి” అని ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చాడు.
పిల్లాడి అమాయకత్వానికి, ఆ కోరికకు సీఎం యోగి గట్టిగా నవ్వుతూ ఎంతో ఆనందించారు. అక్కడే ఉన్న మిగతా వారు కూడా చిన్నారి అడిగిన తీరుకు నవ్వు ఆపుకోలేకపోయారు. వెంటనే ఆ పిల్లాడికి చిప్స్ తెప్పించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఒక చిన్నారితో అంత సాన్నిహిత్యంగా, ప్రేమగా మాట్లాడటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కఠినమైన పాలకుడిగా పేరున్న యోగిలోని సున్నితమైన కోణాన్ని ఈ వీడియో ఆవిష్కరించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

