Monday, April 13, 2026

మామిడిమాడ ముందరి తండాలో గంజాయి కలకలం: కత్తితో హల్చల్ చేసిన యువకుడు

MS8NEWS ఖిల్లాఘనపురం, జనవరి 18: వనపర్తి నియోజకవర్గం ఖిల్లాఘనపురం మండలం పరిధిలోని మామిడిమాడ ముందరి తండాలో ఆదివారం గంజాయి విక్రయాలు, మత్తులో యువకుడి వీరంగం తీవ్ర కలకలం రేపాయి.

​ఘటన వివరాల్లోకి వెళ్తే:తండాకు చెందిన మహేష్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తూ, తానే స్వయంగా మత్తుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం విచక్షణ కోల్పోయిన మహేష్, చేతిలో పెద్ద కత్తి పట్టుకొని స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. గంజాయి మత్తులో ఊగిపోతూ దారి వెంట వెళ్లే వారిపై దాడికి యత్నించడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

​గ్రామస్తుల సాహసం.. పోలీసుల నిర్లక్ష్యం?

​మహేష్ కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా, తండావాసులు సమష్టిగా సాహసం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అయితే, నిందితుడిని పట్టుకుని అప్పగించినా పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

​”గంజాయి మత్తులో కత్తి పట్టుకుని మాపై పడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టుకున్నాం. కానీ పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం.” > — స్థానిక తండా వాసులు

​గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి యువతను నాశనం చేస్తోందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Most Popular