Monday, April 13, 2026

మల్లేష్ కు మద్దతుగా నిరసన తెలిపిన కోరుకంటి చందర్, కౌశిక హరి….

(MS8NEWS డిసెంబర్ 22):గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోనీ సిరిశెట్టి మల్లేష్‌కు చెందిన షాపును అక్రమంగా కూల్చివేశారనే ఆరోపణలతో బాధిత కుటుంబం చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్  మరియు కౌశిక హరి తమ మద్దతు ప్రకటించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లేష్ షాపును అక్రమంగా కూల్చివేయడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడిందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కోరుకంటి చందర్ స్పష్టం చేశారు.రామగుండం నియోజకవర్గంలో ప్రస్తుతం “రాక్షస పాలన” సాగుతోందని, పేదల పొట్ట కొడుతూ అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.కూల్చివేతలకు నిరసనగా బాధిత కుటుంబంతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అక్రమంగా షాపులు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరియు బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.రామగుండంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులు చేపడుతున్న కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Related Articles

Most Popular