Monday, April 13, 2026

మన తొలివెలుగు రఘు స్టూడియో కు ఎన్. ఐ. ఏ. (N I A) నోటీసులు

(MS8NEWS డిసెంబర్ 23): ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘మన తొలి వెలుగు’ (Mana Tolivelugu) జర్నలిస్ట్ రఘు రామకృష్ణకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

​  మాజీ మావోయిస్టు నేత కట్టా రామచంద్ర రెడ్డి మృతి చెందిన ప్రాంతానికి (ఛత్తీస్‌గఢ్‌లోని హిడ్మా గ్రామం సమీపంలో) వెళ్లి వీడియో షూట్ చేసి, దానిని తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడంపై NIA అభ్యంతరం వ్యక్తం చేసింది.మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య (ఇన్నారెడ్డి) ఇటీవల NIA చేత అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టు వెనుక ఉన్న కారణాలు, లోగుట్టు ఇవేనంటూ రఘు చేసిన మరో వీడియో కూడా ఈ నోటీసులకు కారణమైంది. నిషేధిత సంస్థలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారనే కోణంలో అధికారులు దీనిని పరిశీలిస్తున్నారు.గచ్చిబౌలి  లోనీ NIA కార్యాలయం. ఈరోజు (డిసెంబర్ 23, 2025) విచారణకు హాజరై, సదరు వీడియోల విషయమై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇటీవలే మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యను జనగామ జిల్లాలో NIA అధికారులు అరెస్ట్ చేశారు. కట్టా రామచంద్ర రెడ్డి స్మారక సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ క్రమంలోనే, ఈ అంశాలపై రిపోర్టింగ్ చేసిన జర్నలిస్ట్ రఘుకు కూడా నోటీసులు అందడం గమనార్హం.

Related Articles

Most Popular