(MS8NEWS జనవరి 14 రామగుండం): సంక్రాంతి పర్వదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగాయి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు.
రామగుండం “గోదావరిఖని” చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి భోగి మంటలు నిర్వహించారు. అయితే, ఈ మంటల్లో పాత సామాన్లకు బదులుగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన “420 హామీల” పత్రాలను వేసి దహనం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కోరుకంటి చందర్ విమర్శించారు.ప్రజలను మోసం చేసిన “420 హామీలను” భోగి మంటల్లో కాల్చివేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు రామగుండం వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
”కాంగ్రెస్ మార్కు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు.”కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

