Monday, April 13, 2026

భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MS8NEWS జనవరి 16:​గోదావరిఖని:రాబోయే సమ్మక్క-సారాలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ తో కలిసి జాతర మైదానాన్ని, జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జాతర ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు మరియు పారిశుద్ధ్య పనులపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కోరారు.

​అనంతరం, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. పండుగ పూట ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular