Monday, April 13, 2026

ప్రాణాంతకమైన చైనా మాంజా.. వరంగల్ హైవేపై కారు అద్దం కట్!

(MS8NEWS జనవరి 12):వరంగల్: సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో కొందరు వాడుతున్న నిషేధిత ప్లాస్టిక్ (చైనా) మాంజా అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా వరంగల్ రహదారిపై కరుణాపురం వద్ద చోటుచేసుకున్న సంఘటన చూస్తే ఒళ్లు గగుర్పుపొడుస్తుంది.వరంగల్ హైవేపై ప్రయాణిస్తున్న ఒక కారుకు గాలిపటం దారం తగిలింది. డ్రైవర్ అప్రమత్తంగా కారు ఆపి పరిశీలించగా, ఆ దారం పదునుకు కారు సైడ్ మిర్రర్ (అద్దం) సగం వరకు కట్ అయింది. అత్యంత గట్టిగా ఉండే ప్లాస్టిక్ అద్దాన్నే కోసేసిన ఆ దారం, ఒకవేళ బైక్‌పై వెళ్లే వారి మెడకు తగిలి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. గతంలో ఇలాంటి మాంజా వల్ల ఎంతో మంది గొంతులు తెగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి.మెడకు స్కార్ఫ్ లేదా ప్రొటెక్టివ్ గేర్ ధరించండి. వీలైనంత వరకు తక్కువ వేగంతో ప్రయాణించండి. మీ పిల్లలకు ప్లాస్టిక్ మాంజా వల్ల కలిగే నష్టాలను వివరించండి. కేవలం సాధారణ నూలు దారాన్ని మాత్రమే ప్రోత్సహించండి.

​పోలీస్ శాఖకు విన్నపం

​నిషేధిత ప్లాస్టిక్ మాంజాను విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం తనిఖీలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని బాధితులు మరియు స్థానికులు కోరుతున్నారు.

​జాగ్రత్తగా ఉండండి.. ప్రాణాలను కాపాడుకోండి!

Related Articles

Most Popular