Monday, April 13, 2026

ప్రమాణ స్వీకార వేళ రణరంగంగా వర్గల్…

(MS8NEWS డిసెంబర్ 22): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ శ్రేణులు కావాలనే గొడవకు దిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్గల్ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 22) జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని సమాచారం.పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.​”ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం, కార్యకర్తలపై దాడులు చేయడం అరాచక పాలనకు నిదర్శనం” అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

 

Related Articles

Most Popular