(MS8NEWS జనవరి 9):గోదావరిఖని:సమాజంలోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (VSSS) అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని 5 ఇంక్లైన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూ మరియు సాక్సులను పంపిణీ చేశారు.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ & చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి, గోదావరిఖని కళ్యాణ్ నగర్‌లోని హాలీవుడ్ షూస్ నిర్వాహకులు షేక్ జాన్ మహమ్మద్, తాజ్ ఆర్థిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ గౌరవ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి లయన్ డా. సిహెచ్ కిషన్ రావు మరియు ఎంఈఓ మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు.తమ వంతు సామాజిక బాధ్యతగా విద్యార్థులకు షూలు అందించిన హాలీవుడ్ షూస్ నిర్వాహకులను ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు.సంస్థ ప్రతినిధులు: లయన్ డా. కె. రాజేందర్, లయన్ బంక రామస్వామి, పూదరి కుమార్ (ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు). తుము నరసయ్య, గడవేన సదానందం, భూపెల్లి జ్యోతి, దామోదర్ శర్మ, ముల్కల ప్రసాద్. హెచ్.ఎం మల్లారెడ్డి, ఉపాధ్యాయులు సమ్మయ్య, శ్రీనివాస్, రాజేశ్వరి, ప్రేమ్ కుమార్, సరళ కుమారి తదితరులు.

