Sunday, April 12, 2026

ప్రధాన చౌరస్తాలో అక్రమ కట్టడాల కూల్చివేసిన రామగుండం మున్సిపల్ అధికారులు..

(MS8NEWS గోదావరిఖని, డిసెంబర్ 19): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. నగర సుందరీకరణ పనులకు ఆటంకంగా ఉన్న అక్రమ కట్టడాలను జెసిబి (JCB) యంత్రాలతో కూల్చివేశారు.

​ముందస్తు నోటీసులు: నగర సుందరీకరణలో భాగంగా రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న షాపుల యజమానులకు  స్వచ్ఛందంగా షాపులను ఖాళీ చేయకపోవడంతో, అధికారులు ఈరోజు కఠిన నిర్ణయం తీసుకున్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ సిబ్బంది సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.నగర అభివృద్ధి కోసం రహదారుల విస్తరణ అనివార్యమని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కూల్చివేతలతో ప్రధాన చౌరస్తా ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Related Articles

Most Popular