MS8NEWS జనవరి 22 రామగుండం: నగర పాలక సంస్థ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో 43వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా మద్దెల దినేష్ రంగంలోకి దిగారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ప్రజా సమస్యలే అజెండాగా..”తలోంచి సమస్య వింటా.. తలెత్తుకునేలా అభివృద్ధి చేస్తా” అనే నినాదంతో దినేష్ ముందుకు సాగుతున్నారు. డివిజన్ పరిధిలోని ప్రతి గడపకూ వెళ్తూ, ప్రజల దీవెనలు కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మౌలిక వసతుల కల్పన మరియు డివిజన్ సర్వతోముఖాభివృద్ధే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.స్థానికంగా అందరికీ సుపరిచితులైన దినేష్, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు.యువతను ప్రోత్సహిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ, ప్రజా సమస్యలపై అధికారులతో పోరాడటంలోనూ ఆయన ముందుంటున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి!”మీరు ఇచ్చే ఒక్క అవకాశం ఈ డివిజన్ రూపురేఖలను మారుస్తుంది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నిరంతరం మీ సేవలో ఉంటాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించాలని కోరుతున్నాను” అని మద్దెల దినేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

