(MS8NEWS జనవరి 10)రామగుండం :
రాజకీయాలలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు 41వ డివిజన్ యువ నాయకుడు మెంట ఉదయ్ రాజ్. నియోజకవర్గ పరిధిలోని ఎల్బీ నగర్ సిపిఐ ఆఫీస్ సమీపంలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించి, సొంత ఖర్చులతో వీధి దీపాలను ఏర్పాటు చేసి తమ ఉదారతను చాటుకున్నారు.గతంలో ఎల్బీ నగర్ సిపిఐ ఆఫీస్ వద్ద వీధి దీపాలు ఒక ఇంటి గోడకు ఆనుకుని ఉండటం వల్ల, ఇటీవల కురిసిన వర్షాలకు లేదా ఇతర కారణాల వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీనివల్ల ఆ ఇంటి గోడలు విద్యుత్ షాక్కు గురవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు తెలపగానే, వెంటనే స్పందించిన నాయకులు మున్సిపల్ ఎలక్ట్రీషియన్ ద్వారా సదరు కనెక్షన్ను తొలగింపజేశారు.విద్యుత్ కనెక్షన్ తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో (తీన్ రాస్తా జంక్షన్) రాత్రి వేళ చీకటిగా మారి ప్రజలు ఇబ్బందులు పడటాన్ని గమనించిన 41వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం ఉదయ్ రాజ్, తన సొంత ఖర్చులతో కొత్త పోల్స్ (స్థంభాలు) ఏర్పాటు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు: మల్లేష,ల వెంకట స్వామి,ఇంజం సాంబయ్య,కోల సుమంత్, దినేష్, నారెడ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
”ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి బాధ్యతతో పనిచేయడమే మా లక్ష్యం. డివిజన్ పరిధిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి.”అనీ మెంటం ఉదయ్ రాజ్ (డివిజన్ అధ్యక్షులు) తెలిపారు.
సమస్యను సకాలంలో గుర్తించి, పరిష్కరించిన నాయకులకు బస్తీ వాసులు మరియు స్థానిక యువత కృతజ్ఞతలు తెలిపారు

