Monday, April 13, 2026

నేడు,రేపు మున్సిపల్ ఆఫీసుల్లో ఆల్ పార్టీ మీటింగ్స్..?

(MS8NEWS జనవరి 5):రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించబోయే.117 మున్సిపాలిటీలు,6 కార్పొరేషన్లలో ఆల్ పార్టీ నేతల మీటింగ్స్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఉండే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పొలిటికల్ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహించనున్నారు.
అనంతరం జనవరి10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్ లిస్టులు ప్రకటిస్తారు.అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల నియామకం కోసం ఉద్యోగుల జాబితా సిద్ధం చేస్తున్నారు.

Related Articles

Most Popular