Sunday, April 12, 2026

నిస్సహాయ పిల్లల చదువుకు అండగా ప్రవాస భారతీయులు.. నీడ పిలుపు తో ఇద్దరికీ స్కూల్ fees కట్టి చదువు కీ భరోసా కలిపించిన nri లు అలుగుబెల్లి వేణు గోపాల్, బొద్దుల మధుకర్.

 

MS8NEWS గోదావరిఖని ఫిబ్రవరి 19: స్థానిక విటల్ నగర్ కు చెందిన నిరుపేద క్యాన్సర్ పేషెంట్ గాజుల సతీష్ కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు న్నారు. గత రెండు సంవత్సరాలుగా నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ట్రాలీ నడుపుకునే ఇతనికి క్యాన్సర్ శోకడంతో వీరి కుటుంబ పరిస్థితి దీనంగా మారింది. ఇద్దరు పిల్లలు సిరి చందన 10th, అక్షయ 9th క్లాస్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వారు ఫీజు కట్టలేని పరిస్థితి దింతో విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ దాతలు nri లు అలుగుబెల్లి వేణు గోపాల్, బొద్దుల మధుకర్ గార్లు ఉత్తిరిత్య ఆస్ట్రేలియాలో ఉంటున్న వీరి సహకారంతో చెరొకరికి ఫీజు కట్టినారు.ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని దానాల కెల్లా విద్యా దానం గొప్పదని ఒక్కరికి చదువు కనీసం పదిమందికి వెలుగు నిస్తారని తెలిపారు. పిల్లల చదువుకు ఆటంకo కలగకుండా నీడ బాధ్యత తీసుకొని ఇకముందు కూడా వీరికి సహాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నీడ సంస్థ తరుపున పేషెంట్ కుటుంబ సభ్యుల తరఫున దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Most Popular