Wednesday, February 11, 2026

నిర్దేశించిన 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాలి..జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష

MS8NEWS ఫిబ్రవరి 9:ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్ గా పాటించాలని,జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందని,ఫిబ్రవరి 9 సాయంత్రం ఐదు గంటల నుంచి, సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందన్నారు.

సైలెన్స్ పిరియడ్ లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని,ఫలితాల వివరాలను వెల్లడించడం,పత్రికల్లో ప్రచురించడం,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం,ఇతర మాధ్యమాల ద్వారా, ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం నిషేధించామన్నారు.

48 గంటల పాటు..సైలెన్స్ పిరియడ్ లో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించ డానికి వీలులేదని,ఎన్నికలకు సంబంధించి వీడియోలు,పాటలు ప్రదర్శించడానికి వీలు లేదని,రాజకీయ నాయకులు పోటీ చేస్తున్న అభ్యర్థులు,వారి అనుచరులు ఎక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని, ప్రచారానికి ఇతర ప్రాంతాలను వచ్చిన వారు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు.

48 గంటల పాటు,సైలెన్స్ పీరియడ్ లో స్థానికులు మాత్రమే ఉండాలని కలెక్టర్ తెలిపారు.రాజకీయ ప్రచారానికి సంబంధించిన బల్క్ మెసేజీ లు పంపడం నిషేధించామని తెలిపారు.48 గంటల సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో.. పేర్కొన్నారు.

Related Articles

Most Popular