MS8NEWS జనవరి 15:హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. పురపాలక శాఖ ఎన్నికల నిర్వహణ కోసం అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా స్థానాల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.
121 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఇలా..
మొత్తం 121 మున్సిపాలిటీలకు సంబంధించి కేటాయింపులు పూర్తయ్యాయి:
జనరల్: 30 స్థానాలు
జనరల్ (మహిళ): 31 స్థానాలు
బీసీ (జనరల్): 19 స్థానాలు | బీసీ (మహిళ): 19 స్థానాలు
ఎస్సీ (జనరల్): 09 స్థానాలు | ఎస్సీ (మహిళ): 08 స్థానాలు
ఎస్టీ (జనరల్): 03 స్థానాలు | ఎస్టీ (మహిళ): 02 స్థానాలు
పది కార్పొరేషన్ల వారీగా కేటాయింపులు:
కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
జనరల్ మహిళ: 04 స్థానాలు
బీసీ జనరల్: 02 స్థానాలు
జనరల్: 01 స్థానం
ఎస్సీ: 01 స్థానం
ఎస్టీ: 01 స్థానం
బీసీ మహిళ: 01 స్థానం
గణాంకాల ప్రాతిపదిక: ఎస్సీ, ఎస్టీ స్థానాలను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించగా, బీసీ స్థానాల సంఖ్యను ఇటీవల సమర్పించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఖరారు చేశారు.
నేడు (17న) ఈ రిజర్వేషన్లకు సంబంధించి తుది అధికారిక ముద్ర పడనుంది. దీనితో ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది.

