Monday, April 13, 2026

​ఘనంగా ‘ఇది మన హక్కు’ పత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ ​పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

MS8NEWS రామగుండం, జనవరి 16:ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ‘ఇది మన హక్కు’ సమాచార పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ, ప్రజా హక్కులపై అవగాహన కల్పించడంలోనూ ‘ఇది మన హక్కు’ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. పత్రికా రంగం సామాజిక బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ పాల్గొని పత్రికా లక్ష్యాలను వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పెండ్యాల మహేష్: పెద్దపల్లి జిల్లా ఓబీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.​దుర్గాప్రసాద్: ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు.సందీప్: శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ హైస్కూల్ ఏవో.మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పత్రికా సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Most Popular