(MS8NEWS జనవరి 3):ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు భద్రతా చర్యల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన SBI బ్యాంక్, న్యూ అశోక్ థియేటర్ పక్కన యూనియన్ బ్యాంక్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న HDFC బ్యాంక్,రమేష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ లలో, గోదావరి అర్బన్ బ్యాంక్ మున్సిపల్ ఆఫీస్,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, గోదావరి అర్బన్ బ్యాంక్ మున్సిపల్ ఆఫీస్, ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ మార్కండేయ కాలనీ, గాయత్రి బ్యాంక్ లక్ష్మీ నగర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లక్ష్మీ నగర్, ఎటిఎం సెంటర్ లను గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తనిఖీలు నిర్వహించారు. అదేవిదంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిగతా బ్యాంకుల్లో భద్రతపై ఎస్ ఐ అనూష, క్రైమ్ పార్టీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో, ఏటీఎంల వద్ద తనిఖీలు నిర్వహించారు. నేరా నియంత్రణ ముందస్తు చర్యలలో భాగంగా బ్యాంక్, ఎటిఎం సెంటర్లలో అలారం పనిచేసేలా చూడాలని, అదేవిధంగా హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ అవి పని చేస్తున్నాయా లేదా తప్పనిసరిగా చెక్ చేయాలనీ సూచించి అందులో రికార్డు అయినా దృశ్యాలు, ఫోటో లు చెక్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు సీసీ కెమెరాలు వలన నిందితులను గుర్తించడానికి, అనుమానాస్పద వ్యక్తులు బ్యాంకు ఏటీఎం పరిసరాల్లో తిరిగినా కూడా గుర్తించే అవకాశం ఉంటుందని సీఐ బ్యాంక్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… సీసీ టీవీ కెమెరాలు బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం కలిగి ఉండాలని సూచించారు. తదనుగుణంగా బ్యాంకు భద్రతాంశాలపై బ్యాంకు ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు, బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. బ్యాంక్ కు వచ్చే కస్టమర్ లకు ఎవరైనా ఎక్కువ సమయం బ్యాంక్ లో ఉన్నట్టు అనుమానస్పదంగా అనిపిస్తే సమాచారం చెప్పాలని, బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకొని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కస్టమర్లకు అవగాహన కల్పించాలని బ్యాంక్ అధికారులకు సిఐ సూచించారు.

