MS8NEWS జనవరి 22 గోదావరిఖని: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గోదావరిఖని డిపో నుండి ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డిపో మేనేజర్ ఎం. నాగభూషణం ఒక ప్రకటన విడుదల చేశారు.
బస్సుల వివరాలు మరియు సమయాలు: (తేదీ 21.01.2026, బుధవారం) నుండి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
గోదావరిఖని డిపో నుండి మేడారానికి: ఉదయం 5:30 గంటలకు మరియు ఉదయం 11:00 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.
మేడారం నుండి తిరుగు ప్రయాణం: ఉదయం 11:00 గంటలకు మరియు సాయంత్రం 4:00 గంటలకు గోదావరిఖనికి బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

