Sunday, April 12, 2026

గోదావరిఖని నుంచి పూరీ జగన్నాథుని దర్శనానికి ప్రత్యేక బస్సులు – ఒకే ట్రిప్ లో 10 పుణ్యక్షేత్రాల సందర్శన – టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖని డిపో మేనేజర్ వెల్లడి

MS8NEWS ఫిబ్రవరి 17 గోదావరిఖని: ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) గోదావరిఖని డిపో శుభవార్త తెలిపింది. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథునితో పాటు పలు దేవాలయాల దర్శనం కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం. నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల (ఫిబ్రవరి) 22వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటలకు గోదావరిఖని డిపో నుంచి ఈ ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. గోదావరిఖని ప్రయాణికులతో పాటు పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల వారు కూడా ఈ బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.

సందర్శించే పుణ్యక్షేత్రాలు ఇవే..

ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ప్రయాణికులు మొత్తం 10 ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు.

అన్నవరం,సింహాచలం,పూరి జగన్నాథ్,కోణార్క్ (సూర్య దేవాలయం),అరసవెల్లి,శ్రీకూర్మం,వైజాగ్ బీచ్,పిఠాపురం,ద్రాక్షారామం,విజయవాడ.

ఈ పది ప్రాంతాల సందర్శన మరియు దర్శనాల అనంతరం ఫిబ్రవరి 28వ తేదీన బస్సు తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుంది.

చార్జీల వివరాలు:ఈ ప్రయాణానికి సంబంధించి టికెట్ చార్జీలను సంస్థ ఈ కింది విధంగా నిర్ధారించింది:

పెద్దలకు: రూ. 6,800/-

పిల్లలకు: రూ. 4,500/-

యాత్రకు వెళ్లదలచిన ఆసక్తి గల భక్తులు సీట్ల రిజర్వేషన్ మరియు మరిన్ని వివరాల కోసం 7382847596, 7013504982 నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Related Articles

Most Popular