(MS8NEWS జనవరి 10)రామగుండం:రేపు (ఆదివారం, జనవరి 11న) గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.ఈ నేపథ్యంలో, శనివారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సభా స్థలిని సందర్శించి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. స్టేజ్ నిర్మాణం, బారికేడ్లు, మరియు ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులకు సూచనలు చేశారు.సభకు భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని, నియోజకవర్గ ప్రజలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

