Sunday, April 12, 2026

​గాంధీనగర్ – అశోక్ నగర్ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్!

(MS8NEWS జనవరి 10):​రామగుండం:రామగుండం నియోజకవర్గం, 50వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ మరియు అశోక్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమైంది.ముఖ్యంగా గాంధీనగర్ రెండవ వీధిలో ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించనున్నారు. అదేవిధంగా, అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ శాఖ సౌజన్యంతో నూతన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ అభివృద్ధి పనులకు సంబంధించి శుక్రవారం సాయంత్రం డివిజన్ అధ్యక్షులు ధూళికట్ట సతీష్ మరియు మాజీ కార్పొరేటర్ ఎండీ. ముస్తఫా కలిసి రామగుండం అడిషనల్ కలెక్టర్ (FAC) అరుణశ్రీ నీ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.దీనిపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత మున్సిపల్ మరియు ఇంజనీరింగ్ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.డివిజన్ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అభివృద్ధి పనులకు నిరంతరం చొరవ చూపుతున్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కీ ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ధూళికట్ట సతీష్, డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Most Popular