Monday, April 13, 2026

ఖాకీ వీరంగం: పోలీస్ స్టేషన్‌లో ఎస్సై బూతుల పర్వం! ​బిజినపల్లి ఎస్సై శ్రీనివాస్ దురుసు ప్రవర్తన.. యువకులపై దాడి, కుల దూషణలు ​యూనిఫాం లేకుండానే స్టేషన్‌కు వచ్చి రచ్చ.. వీడియోలు వైరల్

MS8NEWS జనవరి 20:శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి, మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని వెనకేసుకొస్తూ.. ప్రశ్నించిన యువకులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీనివాస్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.వెలుగొండ గేటు సమీపంలో ఒక కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్‌ను స్థానిక యువకులు మానవత్వంతో ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించిన యువకులు, అతడిని పోలీసులకు అప్పగించేందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మద్యం సేవించిన డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని అక్కడున్న రైటర్‌ను కోరారు.

ఎస్సై అసభ్య పదజాలం.. దాడి, పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండానే పంపించే ప్రయత్నం చేయడంతో యువకులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్, కనీసం యూనిఫాం కూడా ధరించకుండా షార్ట్, బనియన్ మీద స్టేషన్‌కు చేరుకున్నారు. యువకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, వారిపై బూతులతో దాడికి దిగారు. “లంబడి కొడకల్లారా.. మీ అమ్మలను…” అంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ, వారిపై చేయి చేసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ఎస్సై వ్యవహార శైలిని అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కుల దూషణలకు పాల్పడటంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సదరు ఎస్సైపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Most Popular