గోదావరిఖని మాలల కోసం జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేసిన మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని మాల సంఘం గోదావరిఖని కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత శ్రీ కడమండ శ్రీహరి అధ్యక్షత వహించాగా స్వర్గీయ పీవీ రావు చిత్రపటానికి రామగుండం నియోజకవర్గ మాల సంఘం అధ్యక్షులు శ్రీ మాలెం మధు మరియు అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత గడ్డం నారాయణ చిత్రపటానికి పూలమాలను సమర్పించారు పివి రావు యొక్క త్యాగ నిరతి పై శ్రీ బొమ్మక వెంకటేశ్వర్లు పాడిన పాట అందరిని ఆకట్టుకుంది పివి రావు పోరాటంలో సమకాలీకులైన శ్రీ గడ్డం నారాయణ వారి సేవలను స్మరిస్తూ ప్రసంగించారు జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు గారు ప్రసంగిస్తూ 1998 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎస్సీ కులాల ఏ ,బి ,సి ,డి వర్గీకరణకు వ్యతిరేకంగా అందరిని సమైక్యపరిచి సంఘటితంగా పోరాడి నారు 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం రిజర్వేషన్లు అంటరానితనం ఆధారంగా చేయబడినవి వాటిని ఉపకులాలుగా వర్గీకరించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పీవీ రావు కృషి ఫలించినదని పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన ఎస్సీ ఉపకులాల వర్గీకరణను పివి రావు స్ఫూర్తితో ప్రేరణతో ముందుకు సాగి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన పరిషత్ ప్రధాన కార్యదర్శి జూపాక పోచం జనరల్ సెక్రెటరీ మర్రి ఐలయ్య పిట్టల వెంకటి నంది నరేష్ నంది నాగేశ్వరరావు నూకల మొండి డాక్టర్ బడికల రవీందర్ అందుగుల లింగయ్య కే. పి కుమార్ బక్కి కిషన్ కంటే పెద్దులు దాసరి వెంకటేశ్వర్లు దాసరి రమేష్ నీరటి శ్రీనివాస్ రియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

