Thursday, February 12, 2026

కోల్ బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి

గోదావరిఖని: కోల్ బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం శనివారం గోదావరిఖనిలోని స్వాగత్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వి హెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గ వివరాలు:

  • అధ్యక్షులు: ఎస్ కె మొయినుద్దీన్

  • ఉపాధ్యక్షులు: ఎస్ డి ఇస్మాయిల్ బాబా

  • ముఖ్య సలహాదారులు: ఎండి జాహిద్ పాషా

  • ప్రధాన కార్యదర్శి: ఎస్.కె కిషన్ సింగ్

  • కోశాధికారి: ఎండి ముజాహిద్

  • సలహాదారులు: బూరుగు వంశీకృష్ణ

  • సంయుక్త కార్యదర్శి: తిరుపతి

  • కార్యవర్గ సభ్యులు: నయీమ్, అంకుష్, తాళ్లపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్ డి ఇమామ్, ఎండి సాహిత్.

చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా: ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక రంగ క్షేత్రంలో గత రెండు మూడు దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారికి జరుగుతున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. కాలుష్య కోరల నుండి నగరాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా తాను కానీ, వి.హెచ్.ఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

Related Articles

Most Popular