(MS8NEWS జనవరి 3):రామగుండం నియోజకవర్గం 32వ డివిజన్ పరిధిలోని ఎల్బీనగర్లో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న చంద్రగిరి శశి ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం కష్టంగా ఉందని వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డిని సాయం చేయాల్సిందిగా కోరారు, విషయం తెలుసుకున్న హరీష్ రెడ్డి శశి ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఆయన ఫౌండేషన్ ద్వారా 10000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు, ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలో ఉన్న కాలుష్యం వల్ల ఎంతో మంది ప్రజలు క్యాన్సర్, అదేవిధంగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని భవిష్యత్తులో ఇలా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, రామగుండంలో కాలుష్య రహిత పరిశ్రమలు రాడానికి కృషి చేస్తానని ,అదేవిధంగా కాలుష్యం మూలంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డ కుటుంబాలకు తప్పకుండా భవిష్యత్తులో అండగా నిలుస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి తో పాటు 32(ఓల్డ్)వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, ఫౌండేషన్ ఇంచార్జ్ సిగిరి రాముతో పాటు, సభ్యుడు యుగేందర్ అదేవిధంగా BRS పార్టీ నాయకులు కొండ సురేష్ ,అనిల్ ,రాజుల తో పాటు స్థానికులు పాల్గొన్నారు

