(MS8NEWS డిసెంబర్ 30): ఆర్జీ–2 ఏరియా, 8 ఇంక్లైన్ కాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడుస్తున్నా, కార్మికుల సమస్యలు మరియు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా, INTUC మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు అక్కసుతో విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.గెలిచిన తరువాత ఒక సంవత్సరం తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, అందులో పాల్గొని సమస్యలను పరిష్కరించాల్సింది పోయి దాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు. అనంతరం ప్రాతినిధ్య సంఘంగా INTUC చొరవ తీసుకుని మళ్లీ సమావేశం ఏర్పాటు చేయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సహాయాన్ని పొందుతూ, అదే పార్టీని దూషించడం తగదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో చర్చించి 35 నుండి 40 సంవత్సరాలకు వయో పరిమితి పెంపు, కాంట్రాక్టు కార్మికులకు బోనస్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, కోటి రూపాయల ప్రమాద బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు.అలాగే గత పదేళ్లుగా సింగరేణిని దోచుకున్న BRS అనుబంధ కార్మిక సంఘ అధ్యక్షురాలిని ఆ పార్టీ బహిష్కరిస్తే ఇంకో బాధ్యత లేని సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పెట్టుకుందని. కార్మికుల పట్ల వారి చిత్తశుద్ధి ఏమిటో స్పష్టంగా చూపిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల అసలు సమస్యలను పక్కన పెట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరగగా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ అక్రమ్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, నాయకులు దశరథం, మల్లేష్, రవీందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

