MS8NEWS రామగుండం, జనవరి 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఈదునూరి మల్లేష్ బుధవారం తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల వెన్నంటే ఉంటూ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు.

