Monday, April 13, 2026

కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి ‘రాసలీలలు’?సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు

MS8NEWS జనవరి 20 బెంగళూరు: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు స్థానిక మీడియా సంస్థల్లో విపరీతంగా చక్కెర్లు కొడుతున్నాయి.​గత కొన్ని గంటలుగా కర్ణాటక పోలీస్ వర్గాల్లో మరియు రాజకీయ గల్లీల్లో ఒక వీడియో హాట్ టాపిక్‌గా మారింది.సదరు అధికారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్ గ్రూపులు మరియు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోల పట్ల సదరు అధికారి ఇంకా స్పందించలేదు. అయితే, ఇది తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని ఆయన సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి.

Related Articles

Most Popular