కమీషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం 4411 కేసులు పరిష్కరించబడ్డాయి
59 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.53,24,105/- తిరిగి అందజేత
తేది :21-12-2025 రోజున జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న ( కాంఫౌండబుల్) IPC కేసులు 386 , SLL-16 పరిష్కరించబడ్డాయి.
📌ఇ-పెట్టీ కేసులు .2971.. పరిష్కరించబడ్డాయి
📌డ్రంక్ & డ్రైవ్ కేసులు 1038. పరిష్కరించబడ్డాయి
మొత్తం 4411కేసులు పరిష్కరించబడ్డాయి
📌 సైబర్ నేరాల కు సంబందించి రామగుండం కమిషనరేట్ పరిధిలో 54 కేసులలో బాధితులకు రిఫండ్ అయినా మొత్తం- 24,98,879/-
📌CCPS, పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన 05 కేసులలో బాధితులకు తిరిగి రిఫండ్ అయినా మొత్తం – 28,25,226/-
మొత్తం 59 సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు తిరిగి రిఫండ్ అయినా మొత్తం డబ్బులు రూ.53,24,105/- చేయడం జరిగింది అని రామగుండము పోలీస్ కమీషనర్ పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు తెలిపారు
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ….. రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినాయి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులను సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా గారు అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్ లో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన రెండు జోన్ ల ప్రధాన న్యాయమూర్తి లకు , జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన అధికారులు , సిబ్బంది తదితరులను సీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

