Monday, April 13, 2026

ఓసిపి బ్లాస్టింగ్‌ల మోత.. కూలుతున్న ఇళ్లు! ​సింగరేణి యాజమాన్యం తీరుపై బొడ్డు రవీందర్ ఆగ్రహం ​బ్లాస్టింగ్ మోతాదు తగ్గించకుంటే జీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక

MS8NEWS గోదావరిఖని, జనవరి 16 :సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో (OCP) జరుగుతున్న భారీ పేలుళ్లు స్థానిక ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం జరుపుతున్న అధిక మోతాదు బ్లాస్టింగ్‌లతో కాలనీలు దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం 12వ డివిజన్‌కు చెందిన కలగూర రమేష్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో బ్లాస్టింగ్ ధాటికి గోడలు బీటలు వారి, సెల్ఫ్‌లు ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.

బాధితుడి ఇంటిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు

ప్రమాద విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ 5 ఇంక్లైన్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ బాధితుడి ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కూలిన గోడలను, దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

​యాజమాన్యం మొండి వైఖరి వీడాలి: బొడ్డు రవీందర్ ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం: విఠల్ నగర్, సమీప కాలనీల ప్రజల భద్రతను విస్మరించి కేవలం బొగ్గు ఉత్పత్తి కోసమే భారీ పేలుళ్లు జరుపుతున్నారని మండిపడ్డారు.తాత్కాలిక చర్యలేనా?: గతంలో ధర్నాలు చేసినప్పుడు కొన్ని రోజులు బ్లాస్టింగ్ తగ్గించి, మళ్లీ పాత పద్ధతిలోనే పేలుళ్లు జరపడం బాధాకరమని అన్నారు.

​నష్టపరిహారం డిమాండ్: బాధితుడు రమేష్ కుటుంబానికి జరిగిన నష్టానికి సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, వెంటనే గోడలకు మరమ్మతులు చేయించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

​ముట్టడికి పిలుపు:

యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఓసిపి 3, 5 గనులతో పాటు జీఎం కార్యాలయాన్ని స్థానిక ప్రజలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

https://www.instagram.com/reel/DTkbXyPklrA/?igsh=MXhocTc0YW03NHU2YQ==

Related Articles

Most Popular