Sunday, April 12, 2026

ఎన్టీపీసీ విధులకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.

(MS8NEWS జనవరి 8):​అంతర్గాం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సిరిపురం అఖిల్ బుధవారం రాత్రి తన బైక్‌పై ఎన్టీపీసీ (NTPC) నైట్ షిఫ్ట్ డ్యూటీకి బయలుదేరాడు. లింగాపూర్ నుండి విలేజ్ రామగుండం మీదుగా వెళ్తున్న క్రమంలో, అక్కడి ఒక ప్రమాదకరమైన మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం అఖిల్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేతికి అందిన కొడుకు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Most Popular