Monday, April 13, 2026

ఎం.ఎస్.ఎం.ఈ. (MSME)కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్.

(MS8NEWS జనవరి 3): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఎంఎస్ఎంఈ(MSME)పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్.

 

 సభ్యులు మాట్లాడుతూ చేతివృత్తుల అభ్యున్నతికి విశ్వకర్మ యోజన పథకం శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కేంద్రప్రభుత్వం రూ. 1లక్ష ఆర్థిక సహాయం రెండో విడత 2లక్షలు అందిస్తుందని.  గ్రామీణ యువతకు స్వయం ఉపాధి పొందేందుకు ఉద్దేశించిన విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. శిక్షణ పొందిన అందరికి నిధుల లభ్యతను బట్టి రూ. 1లక్ష సహాయం తప్పనిసరిగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ కీర్తికాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్, ఎంఎస్ఎంఈ డీఎఫ్వో అదనపు సంచాలకులు దశరథ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రాజశేఖర్, ఈవో శ్రావణ్కుమార్, డీఎస్సీడీవో రవిందర్, బీసీ సంక్షేమాధికారి రంగారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, విశ్వకర్మ ఆర్గజైజర్ తాజ్ ఖాన్ పాల్గొన్నారు.

Related Articles

Most Popular