MS8NEWS జనవరి 20 : పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ (స్థానిక సంస్థల) కమిషనర్ జె. అరుణ శ్రీ “ఇది మన హక్కు” సమాచార పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించడంలో సమాచార పత్రికల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా “ఇది మన హక్కు” పత్రిక చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో 60వ, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అబ్బాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు…

