(MS8NEWS డిసెంబర్ 26): ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె విజయవంతం జీతాలు పెరిగేలా కృషి చేసిన కౌశిక హరి కి కృతజ్ఞతలు తెలియజేసిన ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్.
గత నెల రోజుల క్రితం రామగుండం హెచ్పి ఇంధన కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న లారీ ట్యాంకర్స్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ బి ఆర్ ఎస్ నాయకులు కౌశిక హరి ని కలిసి వారికి జీతాలు పెరిగేలా మరియు వారి సమస్యలపై హక్కులపై కృషి చేయాలని కోరారు స్పందించిన కౌశిక హరి ట్యాంకర్ యజమానులతో మాట్లాడి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అనంతరం సోమవారం నుండి సమ్మె చేయడం జరిగింది అయితే దిగివచ్చిన యజమానులు కౌశిక హరితో చర్చలు జరపగా డ్రైవర్లకు 3000 రూపాయలు క్లీనర్స్ కి 2000 వేల రూపాయలు జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు అలాగే రేపటినుండి విధుల్లోకి హాజరుకావాలని నిర్ణయించారు. అనంతరం డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ కౌశిక హరి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే డిపో మేనేజర్ కు మరియు యాజమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ ఆల్తాఫ్ దుర్గన్న అలీం సందీప్ రాజన్న మహేందర్ సాజిద్ శ్రీను విష్ణు తదితరులు ఉన్నారు

