MS8NEWS జనవరి 22 : కొద్దిరోజుల క్రితం షింజితా ముస్తఫా ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని ఆరోపిస్తూ ఒక వీడియో తీసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు దీపక్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, అతడిపై విరుచుకుపడ్డారు.సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్, అవమానాన్ని భరించలేక దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సమాజంలో తన పరువు పోయిందని భావించిన ఆయన, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. ప్రాథమిక విచారణలో షింజితా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలడంతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ ఈ సున్నితమైన అంశంపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) స్పందించింది. ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించింది.
నార్త్ జోన్ డీజీపీకి ఆదేశాలు: ఈ ఘటనపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీని కోరింది.దీపక్ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆధారాలు లభించడంతో పోలీసులు షింజితా ముస్తఫాను అరెస్ట్ చేశారు.

