(MS8NEWS జనవరి 3):రామగుండం: రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని… అయితే ప్రతిసారి గోదావరి వచ్చే సమయంలో ఈ నిర్మాణాలు నది వరద నీటితో నిండుకుంటున్నాయని పేర్కొన్నారు. అలా కాకుండా ఈసారి ప్రత్యేక నిధులు కేటాయిస్తే మరమ్మతులు చేసి నిరుపేదలకు అందిద్దామని పేర్కొన్నారు. వైయస్సార్ సర్కారు హయాంలోనే సుమారు 18వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే ఈసారి ఈ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్నారని…
వారి బతుకుదెరువు కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేద్దామని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పరిశీలించి ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రత్యేకంగా కోరారు.

