Sunday, April 12, 2026

అర్హులైన ప్రతి పేదవాడికి ‘ఇందిరమ్మ ఇళ్లు’ అందాలి: 41వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మెంటం ఉదయ్ రాజ్

​(MS8NEWS రామగుండం, జనవరి 13):రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిరుపేదల కలలను నిజం చేస్తోందని రామగుండం 41వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం ఉదయ్ రాజ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో, ఎటువంటి దళారీ వ్యవస్థకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు.​మంగళవారం డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ముఖ్య విషయాలను వెల్లడించారు,ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడా దళారుల ప్రమేయం ఉండదు. అర్హులైన పేదలకు నేరుగా ప్రభుత్వ ఫలాలు అందుతాయి. ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించాం.మంత్రుల సభలో మంజూరైన ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందజేయడం జరిగింది.డివిజన్ పరిధిలో ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం కలిగి ఉన్నా లేదా పాత ఇళ్లను పునర్నిర్మించుకోవాలి అనుకుంటున్న వారు ఉంటే, వెంటనే తమను సంప్రదించాలని ఉదయ్ రాజ్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

​సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

📞 9966255204

📞 9989096645

​”దళారి వ్యవస్థ లేకుండ అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే మా లక్ష్యం. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటాం.” అనీ మెంటం ఉదయ్ రాజ్ తెలిపారు.

Related Articles

Most Popular