Wednesday, February 11, 2026

అభివృద్ధికి కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి _ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MS8NEWS 7ఫిబ్రవరి 8ఇంక్లయిన్ కాలనీ: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శనివారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8 ఇన్‌క్లైన్ కాలనీలోని 14, 15, 16, 17, 18, 19, 20 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని, ఆ అభివృద్ధికి కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి 76 G.O కింద ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని, గృహం లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టి కాలనీలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రజల నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, చేతి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని కొనసాగిద్దామని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Most Popular